1 కొలుపు
అనవఁన్న డప్పు తూర్పు బజారులో ఆడుగుపెట్టింది.
డిమికి, డిమికి, డిమికి డిడ్డిమికి డిమికి డిం..
సుమారు పది బారలు దాటగానే చిన్న దేవుడిగుడి వచ్చింది. అక్కడ ఆగి కేక పెట్టడం అనవఁన్నకి అలవాటు..
“న్నోరెవరో యిననోరెవరో యినుకోండహో…. ఈ ఆసాడమాసం మూడో సుక్కురోరం అంకమ్మ కొలుపు వుంది. దాని ముందు ఆది వారం పొలిమేర కడతారు సుట్టపక్కాల్ని పిలుసుకోండి… పంచాయితీ తీర్మానం అహో…. ” డిమికి, డిడ్డిమికి, డిడ్డిమికి డిమికి డిమికి డిం..
అనవఁన్న డప్పు ముందుకు పోయింది. ఇళ్ళల్లో వున్న వారందరూ పనులన్నీ ఆపి డప్పు వింటారు. అక్కడ నుండి ఇంకో వంద గజాల దూరం పోగానే జెండా అరుగు వస్తుంది. అక్కడ నాలుగు వీధులు కలిసే కూడలి వుంది. అక్కడ డప్పు ఆపి తిరిగి కేకేస్తాడు. అక్కడ ఎక్కువ మంది చేరి వింటారు. అలా మూడు బజార్లు . తిరిగే సరికే దాదాపు రెండు గంటలు పడుతుంది.
మాది అనవఁన్న అంటే ఆ వూర్లో తెలియనివారుండరు. పదేళ్ళ పిల్లల దగ్గర నుండి తొంభై యేళ్ళ ముసలి వరకు అనవఁన్న అందరికీ ఎరికే. వూళ్ళో చాటింపు అంటే అనవఁన్న వస్తాడు. అతను జబ్బుపడి పడకేస్తే గాని లేదా ఏదన్నా వూరికి పోతే కాని అతని కొడుకు కాటాయ వస్తాడు. వారు తప్ప మరొకరు చాటింపు వేయకూడదు. కారణం మాదిగ అనవఁన్న వూరికి పెద్దమాదిగ, గూడెంలోని ప్రతి మాదిగ కుటుంబానికి వూర్లో కొన్ని మిరాసి ఇళ్ళు వుంటాయి. మిరాసి ఇల్లు అంటే ఆ………………
Reviews
There are no reviews yet.