Maanavi

150.00

In stock

SKU: maanavi Category: Tag:

ఇరవై ఏళ్ల సంసారంలో మీ నాన్నకు భార్యగా, మీకు తల్లిగా బతికాను. మీ నాన్న నన్ను ప్రేమించలేదు. నేనూ మీ నాన్నను ప్రేమించలేదు. ప్రేమించాలనే విషయం కూడా నాకు తెలియదు. మీ నాన్న నా భర్త. భర్తకు ఏం చెయ్యాలో, భర్త దగ్గర్నించి ఏం సాధించుకోవాలో నాకు సమాజం చెప్పింది. అదే చేశాను. ఒక భర్తకు భార్య ఏం చెయ్యాలని బోధిస్తారో, ఒక బిడ్డకు తల్లి ఏం చెయ్యాలని బోధిస్తారో అవే నేను చేశాను. వాటిల్లో ఏ లోపమూ జరగకుండా చేశాను. కానీ నేను ఓడిపోయాను. ఓడిపోక తప్పదు. ఇసుక పునాదుల మీద ఏ భావనమైనా ఎలా నిలబడుతుంది? ఆ ఇసుక పునాదుల మీద మన జీవితాలు నిర్మించుకోవాలని మనకు నమ్మకంగా చెబుతున్న వారిపై నాకివాళ పట్టరాని కోపం వస్తోంది.
          ఆడదానికి జీవితంలో ఏదో ఒక రోజు మనిషిగా, మానవిగా మారాల్సిన రోజు వస్తుంది. మానవిగా మారాలనే కోరిక బలవత్తరంగా కలిగే ఆ క్షణాల కోసం నా మాటల్ని జాగ్రత్తగా నీ మనసులో దాచుకో. మనిషిగా మారాల్సిన ఆ రోజు వచ్చినప్పుడు అట్లా మారే శక్తి లేకపోతే, మారటానికి ఏ ఆధారమూ దొరక్కపోతే మనం సర్వనాశనం అయిపోతాం. మనమంటూ మిగలం. అందుకని మన ప్రాణాలు ధారపోసి అయినా సరే మనుషుల్లా మారటానికి కావాల్సిన శక్తి సంపాదించుకొని తీరాల్సిందే. ఈ నవల అందరూ తప్పక చదవాల్సిందే.

author name

Olga

Format

Paperback