తెల్లని పలుచటి తడిబట్టను ముఖం మీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్ ప్రసాద్ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది. ఇంకా కనబడనిది ఏదో ఉందని కూడా తెలుస్తూ ఉంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్ మానసిక మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దుఃఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు. బయటికి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ భైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ ఉండగా కనీకనబడని చెమ్మతో కళ్ళు మసకబారే పఠనానుభావం.
Reviews
There are no reviews yet.