Krishnateeram

120.00

In stock

SKU: CREA001 Category: Tag:
Author: Malladi Ramakrishna Sastry

దివిసీమలో ఎండలు ముదిరినాయి. ఎండవలసిన చెట్టూచేమా ఎండుకొచ్చినాయి. ఎండు పట్టడం ఆకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది. అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న. అవనిగడ్డ గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యంలో ఇంచుమించు అందరూ ఆపాటి మోతుబారులే – చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి. పువ్వులతోబాటు పత్రిలాగా. ఆ బహు కొద్దిమందిలోనూ, ఓ విధంగా చూస్తే ప్రథమ గణనీయుడు – ఇతగాడు. తిండికి బొటాబొటిగా సరిపోయే గింజలు రాలే చేనుంది. పప్పూ ఉప్పు వగైరాలంటే – ఉన్నది నాల్ల నడుమ కనుక, ఏదో నోటి మంచితనాన ఎలాగో సర్డుకుపోవటం పొరపాటు అయింది. అది ఈ తరంలో పుట్టింది కాదు. తండ్రి నాటి నుంచి వస్తున్న ఆనవాయతి. తరువాత ఏం జరిగిందో ఈ కృష్ణాతీరం చదివి తెలుసుకొనగలరు.

Author

Malladi Ramakrishna Sastry

Format

Paperback