మూలవాసుల స్వాభిమాన సంతకం
-
VIDYASAGAR RAO
సి.హెచ్.విద్యాసాగర్ రావు, పూర్వ గవర్నర్, మహారాష్ట్ర
మాతృమూర్తయినా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే. బంధం, భరోసా, భద్రత, స్వేచ్ఛ. తల్లి గర్భాలయంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలిఅడుగు మోపే నవజాత శిశువుకు వీటి అస్తిత్వం అనివార్యంగా ఆస్తిగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒకజాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదీవాసీ ప్రజల అస్తిత్త్వం, గౌరవం, కృషి ఏమేరకు గుర్తింపుకు నోచుకుంది అనేదానిని బట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్త్వం అవగాహన అవుతుంది. ఆదివాసి సంస్కృతికి, అడవి బిడ్డల ఆత్మ ఘోషకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ ఆర్.ఆర్.ఆర్ చిత్రం కోసం కొమురం భీముడో పాటను అందించిన సుద్దాల అశోక్ తేజ ఇప్పుడు మరోమారు జయకేతనం ఎగురవేశాడు. అశోక్ తేజాకు ఈ మధ్యనే మేము పంపన పురస్కారంతోపాటుగా స్వర్ణకంకణాన్ని బహూకరించటం వెనక ఉన్న అసలు చరిత్ర బహు పెద్దది.
మనిషి స్వేచ్ఛా, స్వాతంత్రాల మీద ఉక్కుపాదం ఎక్కు పెట్టిన ఏ ప్రభుత్వాలు ఎల్లకాలం మనలేవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, వారి దమననీతిని ఎండగట్టేందుకు కొమురం భీం నోటివెంట ఒకపాటని దగ్ధగీతంగా అందించారు. పాటనే శూలంగా మార్చి పోరాటాలు బావుటాను ఎగరేసిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. స్వయంగా అడవితల్లే తన గిరిజన సంతానానికి ఆత్మ గౌరవ బావుటాని ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరికలను ఒక పాటగా అందిస్తుంది………….
Reviews
There are no reviews yet.