కిషన్ చందర్ రాసిన “జంగ్లీ” నవల ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంలో పెరుగుతున్న ఆ నగర వైరుధ్యలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్ర్యం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు.
జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్ చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీ యువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్లకూ వేదికైన బొంబాయి నగర “ఫుట్ పాత్” “అలగా జన” జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్ చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే అయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.
– గడ్డం కోటేశ్వరరావు
Reviews
There are no reviews yet.