చాలామంది ఏం చేస్తారంటే ‘నాడా’ దొరికిందని గుర్రాన్ని వెతుకుతారు. కొందరు ‘గుర్రం’ ఉందని నాడాను వెతుకుతారు. ఈ రెండూ ఉన్నా సరే కథ కాదు. ఈ రెండూ కలిసి ‘నాడా ఉన్న గుర్రం’ కావాలి. దానికో రౌతు కావాలి. ప్రయాణించడానికి గమ్యం కావాలి. ప్రయాణానికి ఉద్దేశం ఉండాలి. ప్రయాణంలో సంఘర్షణ ఉండాలి. ప్రయాణానికి ఫలితం ఉండాలి. అప్పుడు కథ.
ఈ పుస్తకంలో…
– కథలేవారు రాస్తారు?, కథలు దేంతో రాస్తారు?, కథలకు ముందు ఏం రాస్తారు?
– కథలెందుకు రాస్తారు?, కథలేప్పుడు రాస్తారు?, థీమ్ అంటే… ఫ్లాట్ అంటే…
– మంచి ప్రారంభాలూ… గొప్ప ముగింపులూ….
– పుస్తకం ఎప్పుడు వేయాలి?, పుస్తకం ఎలా వేయాలి?, పరిచయాలు కోరే ప్రాణత్యాగం…. మొదలగు విషయాలు కలవు……
Reviews
There are no reviews yet.