నా రచనకు వస్తువు
ప్రతి మనిషి జీవితమూ అచ్చుకాని ఒక బృహధ్రంథం. ఆ గ్రంథంలోంచి కొన్ని నవలల్నీ, కొన్ని వందల కథల్నీ ఏరుకోవచ్చు. చాలామంది తమ జీవితపుటల్ని తెరిచే వుంచుతారు. కొన్నిచోట్ల ఒడుపుగా మనమే వాటిని తెరిచి చదువుకోవాలి. నాకు ఇతరుల జీవితాల్ని చదవడమంటే సరదా. నా రచనలకు వస్తువు చాలాసార్లు అక్కడే దొరుకుతుంది.
అయితే, అక్కడ దొరికేది ముడిసరుకు మాత్రమే. ముడిసరుకులో మలినాలు | అనేకం వుంటాయి. ఒక్కొక్కప్పుడు అక్కర్లేనివే చాలావుండి, కావలసినది తక్కువగా వుంటుంది. దాన్ని శుద్ధి చేసుకోవాల్సివస్తుంది. నేను ఎప్పుడూ అంచెలంచెలుగా అక్కర్లేని వాటిని తొలగించుకుంటూ, అందులోంచి కావలసిన పదార్థాన్ని వేరుచేస్తాను. ఆ తర్వాత దాన్ని నాకు కావలసినరీతిలో పోతపోస్తాను. పోతసరుకు ఎప్పుడూ మోటుగానే వుంటుంది. దాన్ని చిత్రీపట్టి నగిషీలుగా చెక్కి, నాకు తృప్తిగావుంటేనే తీసుకొచ్చి నలుగురిముందూ పెడతాను. నేనే కాదు సర్వసాధారణంగా ఏ రచయితైనా అనుసరించే పద్ధతి స్థూలంగా యిదే…. అయితే సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మాత్రం ఒక రచయిత అనుసరించే పద్ధతికీ, మరో రచయిత అనుసరించే పద్ధతికీ అడుగడుగునా ఎంతో తేడా వుంటూనే వుంటుంది.
ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది. అది నా జీవితంలో జరిగిందైనా కావచ్చు. మరొకరి జీవితంలో జరిగిందైనా కావచ్చు. అందులో ఆసక్తికరమైన విషయం వుంటే | దాన్ని తీసి ఓ పక్కన పెడతాను. కొంతకాలంపాటు అక్కడే వుంటుంది. తీరికవున్నప్పుడల్లా దాని గురించే ఆలోచిస్తాను. చేర్పులూ మార్పులు చేస్తాను. చక్కటి ప్రారంభమూ, మంచి | ముగింపూ ఆలోచిస్తాను. మనసు ఒక ప్రయోగశాలగా పనిచేస్తుంది. ఎన్నో వడపోతలు | జరిగి, ఎన్నో మార్పులు చేర్పులూ పొంది, ఎంతో కాలానికి చివరికి అది ఒక ఆకారాన్ని చకుంటుంది. మనస్సనే లేబరేటరీలో వుంచిన సంఘటన, చివరకు ఒక కళారూపాన్ని సంతరించుకుంటుంది.
ఆలోచనఅనేది మనిషి సంపాదించుకున్న గొప్ప వరం. కల్పన అతనికి చిన్నప్పటినించీ అలవాటైన విద్య. ఒక సంఘటన జరిగి, అది నలుగురి నోటిమీదుగా
కి ఒక కొత్తకథ తయారవుతుంది. దీనికి కారణం – మనిషి ఎప్పుడూ తన కాలునిక శక్తిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు గనక. స్వతహాగా ప్రతి మనిషిలో యీ…………..
Reviews
There are no reviews yet.