రాజు , ఋషి ?
నృపతి, నృపతి నిర్మాత ?
మనిషి , మర్మయోగి ?
చంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లే ఈ అద్భుత పుస్తకంలో
అక్షరాలా అదే చేశారు.
‘కధ చాణక్య’ ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే.
స్రుకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం
చేయటంలో కధ – చాణక్య తోడ్పడుతుంది
రాధాకృష్ణన్ పిళ్లే ప్రఖ్యాత రచయిత. ఆయన రచనలు ‘కార్పొరేట్ చాణక్య’, ‘చాణక్యాస్ 7 సీక్రెట్స్ టు లీడర్ షిప్’, ‘మీలోని చాణక్య’, ‘చాణక్య అలా చెప్పాడు’, ‘చాణక్య నీతి’ అత్యుత్తమ అమ్మకాలు సాధించాయి. సంస్కృతంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందారు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఆయన పిహెచ్.డి సాధించారు. ఆయన పేరుపొందిన మేనేజ్ మెంట్ సలహాదారులు, వక్త. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చాణక్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ పిప్ స్టడీస్ (CIILS) విభాగానికి ఆయన డెప్యూటీ డైరెక్టర్. handle @rchanakyapillai ద్వారాఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇతర ముఖ్య సామాజిక మాధ్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొంటారు.
Reviews
There are no reviews yet.