“కన్యాశుల్కం 1909లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఎదో మార్పు కలిగింది. ఆ నాటకం మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపది ఎదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.”
– శివశంకర్ శాస్త్రి
“ఆ కాలంలోనే మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాటకాలు ఆడిస్తూ ఉండేవారు. మాకంటే పెద్ద విద్యార్థులు ఒకసారి కన్యాశుల్కం మొదటి దృశ్యాలు ప్రదర్శించారు. అందులో నేను వెంకటేశం పాత్ర, శేషగిరిరావు కరటక శాస్త్రి పాత్ర ధరించాము.”
– గిడుగు సీతాపతి
“ప్రజలకు సన్నిహితంగా ఉన్నటువంటి భాషలో, తెలుగు సంస్కారంలో వున్నా దైన్యాన్నీ, మాలిన్యాన్నీ, కుట్రల్నీ, కుహకాల్నీ, ఆశనీ, నిరాశనీ చిత్రించటంలో ఈ నాటకాన్ని మించింది ఇంకోటి లేదు. నేడే కాదు రేపటిక్కూడా ఇది ఆడదిగినదే, చూడదగినదే!”
– అబ్బూరి రామకృష్ణరావు
“ఒక తాత్కాలిక దురాచార హేళన నెపంగా రచించాబడినా, కథా చమత్క్రుతీ, భావసామరస్యమూ, పాత్ర చైతన్యమూ కలకలలాడుతూ ఉండడంవల్ల జన హృదయానికి ఎక్కి నిలిచినా ఆంద్ర ప్రబంధం.”
– భమిడిపాటి కామేశ్వరరావు
Reviews
There are no reviews yet.