చరితకు దర్పణంగా నిలిచే పుస్తకం
భూగోళం ఒక్కటే అయినా విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, వివి జీవన విధానాలు, సాంప్రదాయాలు విస్తరిల్లి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలు అనేక ప్రత్యేకతలతో జీవిస్తున్నాయి. ఆహారవిహారాది అం? నుండి ఆధ్యాత్మిక సంగతులు దాకా ప్రతి అంశంలోనూ విభిన్నత ఆయా సమాజ సుస్పష్టంగా కనిపిస్తాయి. మానవ వికాస చరిత్రను అధ్యయనం చేస్తే యుగాలు తరబడి జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. కోటానుకోట్ల సంవత్సరాల నుండి జరిగిన జీవపరిణామం శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడు ఏక కణ జీవి నుండి నేటి మనిషి దాకా జరిగిన పరిణామాలు భారతదేశ సంప్రదాయ శాస్త్రాల
కోణం నుండి చూసినప్పుడు చాలా భిన్నంగా కన్పిస్తాయి. వేద పురాణాలు, కావ్యశాస్త్రాలు బోధించిన విషయాకడప లు శాస్త్ర పరిజ్ఞానంతో విభేదిస్తుంటాయి. అయినా మనషులు సంప్రదాయాల్ని ఆరాధిస్తూనే ఆధునిక శాస్త్ర సాంకేతికత అందించే | సౌకర్యాలను అనుభవిస్తున్నారు. ఇంతటి సంక్లిష్ట భావాలు కలిగిన మానవ సమాజం | గురించి దాని చరిత్ర గురించి రాయాలంటే అంత సులువైన పని కాదు. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే సంప్రదాయ పునాదులమీద ఆధునిక జీవనం గడుపుతున్న చారిత్రాత్మక గడ్డ అయిన ‘కడప’ గురించి రాసిన “కడపజిల్లా విజ్ఞాన దీపిక” అనే పుస్తకంపై నాలుగు మాటలు చెప్పడానికే. మిత్రుడు డా.చింతకుంట శివారెడ్డి మాతృగడ్డ రుణం తీర్చుకోవడానికై అన్నట్లు కడప జిల్లా ప్రత్యేకతలను పూసగుచ్చి ఒక గ్రంథంగా సమాజానికి అందిస్తున్నాడు. ఒక బృహత్తర కార్యక్రమంగా శివారెడ్డి సాగించిన విషయ సేకరణ, పరిశీలన, విశ్లేషణలు ‘కడప చరిత్ర’కు కొత్త గొంతును ప్రసాదించింది. కడప నామరూప చరిత్రతో మొదలు పెట్టి కడపయాసపై,
కడపజిల్లా విజ్ఞాన దీపిక
Reviews
There are no reviews yet.