లైన్ రాసిన ఆనందాబాయి జోషి ఆంగ్ల జీవితచరిత్ర ఈ అధ్యాయానికి ఆధారం) భరతభూమి వేదభూమి, పుణ్యభూమి మాత్రమే కాదు, తల్లి వంటి మాతృభూమి. అనాదికాలం నుండి మహిళలు వేదోపనిషత్తులలో, శాస్త్రజ్ఞానంలో, సాహిత్య, కవిత్వాలలో తమ ప్రజ్ఞ, విద్వత్తు చాటుకున్నారు. సంప్రదాయ-సంస్కృతులు ఆమోదించినా లేకున్నా మహిళల అడుగు ప్రగతిపథం దిశగానే సాగిందని చెప్పటానికి వేనవేల తార్కాణాలున్నాయి. అటువంటి స్త్రీమూర్తులలో అనర్ఘరత్నం డాక్టర్ ఆనందీబాయి జోషి.
ధ్యేయాలను సాకారం చేసుకోవటం, అవరోధాలను దాటుకుని ముందుకు సాగటం అప్పటి తరం మహిళలలో అధిక శాతం మంది కలలో కూడా ఊహించలేనివి. ఆ కాలంలోనే డాక్టర్ ఆనందీబాయి స్త్రీల జీవితంలో విద్యాసముపార్జన ప్రాముఖ్యాన్ని తన జీవితమే ఉదాహరణగా చాటి చెప్పింది. ఆనందీబాయి జన్మనామం యమున. మహారాష్ట్రలోని పూనా నగరంలో సనాతనాచారపరులైన మహారాష్ట్ర చిత్పవన్ బ్రాహ్మణుల వంశంలో గణపతిరావు అమృతేశ్వర జోషీ, గంగూబాయి దంపతులకు 1865 సంవత్సరం మార్చ్ 31వ తేదీన యమున అనే అమ్మాయి పుట్టింది. గణపతిరావు దంపతులు పది మంది సంతానంలో ఆమె ఆరవది. యమునకు నలుగురు
అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు. ఒక అక్క బాలవితంతువు. యమునకు పదేళ్లు వచ్చేసరికే ఇద్దరు అన్నలు, ఒక అక్క, ఒక చెల్లెలు మరణించారు.
మహారాష్ట్రంలోని ఠాణే జిల్లాలోని కళ్యాణ్ అనే నగరం యమున తండ్రిగారి స్వస్థలం. అక్కడ ఆయనకు భూములు ఉండేవి. ఉన్నత కులస్థుడిగా సమాజం ఆయనను గౌరవించేది. దగ్గర బంధువైన గంగుబాయితోనే గణపతిరావు వివాహం జరిగింది……………..
Reviews
There are no reviews yet.