ఈ భూమి మీద పుటిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఉహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ఎన్నో శతాబ్ధాలుగా ఏదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలన చిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తనగా అభివృద్ధి చెందుతూ, మిగితా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంలో ఏంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచి కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా బావించబడ్డ ఎన్నో కధలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.
-వెంకట్ శిద్ధారెడ్డి.
Reviews
There are no reviews yet.