Chintadeekshitulu- Bala Sahityam

Rs.230.00

In stock

SKU: NSH00105-1-1 Category: Tag:
Author: Balavagmaya Brahma

ఎంత ఆకాశ పథాన విహరించే భావాన్నయిన భూమికి దింపి సంఘానికి వెలుగుదారి చూపుతూ కవిత్వం రాయగల ప్రతిభాశాలి. శిష్ట వ్యవహారికాన్ని కమ్మగా హుందాగా వాడారు. పద్యాలలో కూడా దానికి గౌరవాన్ని సంపాదించారు. గురజాడ అప్పారావు గారిని అభిమానంతో చూసుకునేవారు. ఏకాదశి కథలు హాస్య కథలు వటిరావు కథలు గోపి మోహిని లాంటి అనేక రచనలతో పాటు మన ఇండియా, నేటి మానవుని కృషి లాంటి అనువాదాలు కూడా అయన చేసినవే.

పక్కున సూర్యుడు నవ్వాడంటే

పట్టపగలు ఈ లోకమునకు

పక్కున చంద్రుడు నవ్వాడంటే

చల్లని వెన్నెల జగములకు పక్కున పాపాయి నవ్వాడంటే పరమానందం నీకు నాకు

నవ్వడమెందుకు నిజాము పలకవే అవునో కాదో అలివేణి.

 

ధగధగ మెరిసే కాంతిని చల్లే

కళ్ళు నేమలికేవరిచ్చారో?

పూరి విప్పుతూ అది నాట్యమాడగా

తాండవ కృష్ణుడు జ్ఞప్తికి రాడా?

మేఘలందం నీలాలందం

కాంతల కాటుక కన్నుల అందం

అందాలన్నీ జీవం దాలిచి

నీలో నాట్యం చేసెనే?

జ్ఞాపకముంటే చెప్పరాదటే

కృష్ణుని బాల్య క్రీడలు మాతో

కృష్ణుని వేణికి నీవా అందం

నీకే అందం ఆ వేణా?

చెప్పరాదటే చిన్ని కృష్ణుని

కూకటి ముడిలో తాండవమాడిన నాటి వైభవము నీదే అయితే

కృష్ణ గాథలు కర్ణామృతముగా?

ఆ నాడా మురాళాలించితి వట

గోపాలోన్నత శిరమున నిలిచి

మురళిమోహన దివ్య గీతముల

ప్రతిబింబములా నీలో తళుకులు?

నిన్ను బాలకులు నిత్యమూ కోరుతూ

నీతో ఆటలు ఆడే వేళల

వారు కృష్ణులను భావము పుట్టును

నిజమంటావా? కాదా? చెప్పవే.

-బాలవాజ్మయ బ్రహ్మ.

Author

Balavagmaya Brahma

Format

Paperback