Chick Lit (Telugu)

250.00 Original price was: ₹250.00.220.00Current price is: ₹220.00.

In stock

Category: Tags: ,

ట్రిగ్గర్ వార్నింగ్
“ఈ డ్రెస్ ఎలా ఉంది?” ట్రయల్ రూం డోర్ ఓపెన్ చేస్తూనే అడిగింది అశ్విని.

అప్పటికి పది డ్రసెస్ ట్రై చేసింది అశ్విని. ట్రయల్ రూం బయటే నిల్చుని మొబైల్ ఫోన్ చూసుకుంటున్న షాలిని. “చాలా బావుంది,” అని చెప్పింది.
ఇంతలో పక్క రూం నుంచి బయటకు వచ్చి, “నేను ఇది ఫైనల్ చేస్తున్నా,” అంది.
“టూ బ్రైట్ కీరూ,” అంది షాలిని.
“రెడ్ నీకిష్టమైన కలర్ కదా షాలూ,” నవ్వుతూ అంది కీర్తన.
“కీర్తనా, ఫస్ట్ నా సంగతి చూడండి. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు,” అంది అశ్విని మధ్యలో కలుగచేసుకుంటూ.
అశ్వినిని పైనుంచి కిందకు చూస్తూ, “సో సోగా ఉంది,” అంది కీర్తన.
“అదే అనుకున్నా, పొట్ట కనిపిస్తుంది కదా?” అంది అశ్విని పొట్ట లోపలకి లాక్కుంటూ.
“హే, ఏంటి మీ సోది. అషూ, అది అలాగే చెప్తుంది. చాలా బావుంది ఈ డ్రస్. నేను చెప్తున్నా కదా! నమ్ము,” అంది షాలిని………………

author name

Kadali Satyanarayana

Format

Paperback