నగర జీవిత విధానం మీద సంచార జీవిత విధాన ఆధిక్యత జెంఘిజ్ ఖాన్ చూపించదలచుకున్నాడు. తాము జయించిన ప్రాంతాల నుంచి కప్పం రాబట్టుకుంటూ తాము పచ్చికబీళ్ల మీదనే వుండాలని అనుకున్నాడు. వ్యవస్థాపరంగా ఎక్కువ అభివృద్ధి చెందిన నగర నాగరికత వున్నప్పుడు జెంఘిజ్ ఖాన్ చేసినలాంటి ప్రయత్నాలు నెరవేరవు.
జెంఘిజ్ ఖాన్ నిరక్షరాస్యుడు. జెంఘిజ్ ఖాన్ ని వ్యక్తిగా పరస్పర విరుద్ధ అంచనాలు వేశారు. నెహ్రూగారి లాంటివారు “This man fascinates me” అన్నారు. ఏడువందల సంవత్సరాల తర్వాత, “దేవుడి శాపంగా వచ్చిన వాడని పర్షియన్లు, తరుష్కులు, పాశ్చాత్య చరిత్రకారులు “కీర్తించిన” జెంఘిజ్ ఖాన్ కి నెహ్రూగారు చాలా గౌరవం ఇచ్చారు.
ఎన్ని పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఎంతమంది వ్యక్తం చేసినా జెంఘిజ్ ఖాన్ మహావీరుదన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేదు. అలాంటి వాడు మంగోలుల మహానేత జెంఘిజ్ ఖాన్.
Reviews
There are no reviews yet.