Bharathadesam Pakshana

225.00

In stock

SKU: ALAK0019 Category: Tag:
Author: Nadella Anuradha

పుస్తక రచయిత విల్ దురంత్ దాదాపు వంద సంవత్సరాల క్రితం నాగరికత పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునే క్రమంలో భారతదేశాన్ని సందర్శించారు. ఆంగ్లేయుల పాలనలో భారతీయుల దైన్యాన్ని ప్రత్యక్షంగా చూసి, కలతపడిన మనసుతో ప్రపంచానికి వాస్తవాన్ని చెప్పేందుకు పూనుకుని రాసినదే ఈ పుస్తకం.

భారతదేశ చరిత్రలో మరుగుపరచబడిన ఎన్నో చీకటి నిజాల్ని అక్షరీకరించారు. ప్రపంచంలోనే అత్యంత నాగరీకులని, స్వేచ్ఛాప్రియులని చెప్పబడే ఆంగ్లేయుల పట్ల తనకున్న అభిమానం గురించి చెబుతూనే, భారతీయుల పట్ల వారి అమానుష వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

“నూట ఏభై సంవత్సరాల కాలంగా ఉద్దేశ్య పూరకంగా బ్రిటీష్ ప్రభుత్వం ఏవిధంగా భారతదేశాన్ని దోపిడీ చేస్తూ వచ్చిందో నా అధ్యయనం ద్వారా తెలుసుకుంటున్న కొద్దీ నా ఆశ్చర్యానికి, అసహనానికి అంతులేకుండా పోయింది. మొత్తం చరిత్రలోనే అత్యంత పెద్ద నేరాన్ని చూస్తున్నానన్నది నాకు తోచింది. ..

ఎక్కడో దూరంగా భూప్రపంచానికి ఆవలివైపు స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఏ ఒక్క భారతీయుడైనా నా మాటలు విని ఎంతోకొంత ఓదార్పును పొందగలిగితే నేను కొన్ని నెలలుగా పన్ని చేస్తున్న ఈ చిన్న పుస్తకానికి న్యాయం జరిగిందనే అనుకుంటాను.

భారతదేశం కోసం నేను సాయమేదైనా చెయ్యగలనంటే దీనికి మించినది లేదని నమ్ముతాను.”

“ప్రపంచ స్వేచ్ఛకోసం నిలబడేవారికి, రంగు, జాతి, వర్గ విభేదాలు తెలియని వారికి, ప్రేమ, మానవత్వం, న్యాయం అనే మతాన్ని నమ్మేవారికి, ఇంకా ఈ భూతలం మీద స్వేచ్ఛకోసం పోరాడుతూ తమ పట్ల సానుభూతికోసం చూసే అణగారిపోయిన ప్రజలకు, ప్రపంచశాంతి పట్ల వారిలో ఇమిడి ఉన్న ఆశాభావానికి ప్రేమతో, కృతజ్ఞతతో పుస్తకాన్ని అంకితం ఇస్తున్నానంటూ ” లాలా లజపతి రాయ్ తన “అన్ హ్యాపీ ఇండియా’ ముందు ఉటంకించిన మాటలను చెబుతూ తాను ఇంతకన్నా చెప్పేందుకేమీ లేదన్నారు విల్ దురంత్,

Author

Nadella Anuradha

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Bharathadesam Pakshana”

Your email address will not be published. Required fields are marked *