అసంగతం
నెలమీదంతా చినిగిపోయి, మసకబారి, విరిగిపోయి మాసిపోయిన పూలు… ఎప్పుడు పరిచారో లినోలియం… అరిగిపోయిన ప్యాచ్… అమసక బారిన చీకటో… ఒకప్పటి తాజా సౌందర్యం. మాసిపోయిన దిండ్లేసున్న పేము చెయిరో కూచునుంది, ఆమె జుట్టు రెండు పాయలుగా విడిపోయి ఒక పాయ ముందు భాగాన ఆమె వాలిన చన్నుమీంచి
జాలువార్తోంది. రెండు పండ్లూడి పోయిన్దువ్వెన్తో దువ్వుకుంటూ దువ్వెన్ని జుత్తు మధ్యలోనే చిక్కిచ్చి
“ఎన్ని రోజులిలా?” అడిగింది షమీమా
పెదవి విరిచి… “అలాంటి ఆలోచన్లే వుండుంటే ఈ దినమిలా వుండేది కాదేమో” అన్నా…
“కభీసోచానహీ కభీఘబ్ రాయా నహీ… బస్ యూ హీ చలే జానా హై” వెంటనే హమ్ చేసా…
“మీరు సరే అరవైల్లో కొచ్చేస్తున్నారు…. నా విషయమేంటి? నిన్ననే నాకు ముప్పై రెండొచ్చాయి….” కళ్లని జుత్తు చివరనున్న చిక్కుల్లో చేర్చి ముడి వేసి అంది షమీమా…..
“ఆలోచించుమరి… మనిద్దరం ఆలోచించీ ప్లాన్టేసుకుని కాన్సిక్వెన్సెస్ ఎలా వుంటాయని పూర్తి స్పృహతో కల్చుండడం లేదు కదా?” జేబులోంచీ అంచులు కుట్లూడిన పర్స్ తీసి లోపలి డబ్బు లెక్క పెడ్తూ అన్నా…
Reviews
There are no reviews yet.