” ఇంతమంది మేధావులున్నారు గదా
ప్రపంచంలో – వీళ్ళలో ఒక్కరయినా అన్నం
తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు ?
ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం
వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు
నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?
ఈ యుద్దాలు, ఈ నాశనాలు, భాదలు,
తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా?
అంతా సుఖంగా బతుకుతారుగా !
వాళ్లీ విధంగా ఆలోచించారు”
జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో
వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి
సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు.
ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో
పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు”
Reviews
There are no reviews yet.