ఉత్తర అమెరికాలో వలస రాజ్యాల విస్తరణకుగాను జరిగిన యుద్ధాలలో, శత్రుసేనల్ని ఎదుర్కొనే ముందు, ప్రమాదకరమైన అటవీ ప్రదేశాల్ని దాటడమనేది ఒక సమస్య. హద్దులు లేని అడవులే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ స్వాధీనంలో ఉండేవి. సుశిక్షితులైన యూరపియన్ లూ, దృఢ శరీరులైన దేశీయులూ కలిసి, అతి వేగంగా ప్రవహించే ఏళ్లనూ, అత్యున్నతమైన పర్వత శ్రేణులనూ దాటేందుకే నెలలు పట్టేది. ఓర్పుతో ఇబ్బందులనన్నిటినీ వారు దాటేవారు. యూరప్ లోని స్వార్థపరులైన రాజులను తృప్తి పరిచేందుకు గాను, సేనలకు తెలియని ప్రదేశమంటూ లేకుండా, కాలమే సహాయపడింది.
ఈ యుద్ధాలలో భీకరమైనవి హడ్సన్ నది జన్మ స్తానం దగ్గరా, ఆ చుట్టు పక్కలనున్న సరస్సుల ప్రాంతాల్లోనే జరిగినవి. దేశీయుల క్రూరత్వమంతా ఆ ప్రదేశాలలో మిన్ను ముట్టింది.
– ధనికొండ హనుమంతరావు
Reviews
There are no reviews yet.