“నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు శ్రీజ. మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. దానిని మనం నమ్మలేం.”
“మనసుని కాదు రాధిక, నన్ను చుట్టుకున్న పరిస్థితులను నమ్ము. పదమూడు ఏళ్ళకే అమ్మానాన్నలు దూరమైతే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటివరకు వాళ్ళే నా ప్రపంచం… ఒక్కసారిగా ఆ ప్రపంచం కూలిపోయింది. చిన్నపిల్లని నేను… ఆ వయసులో నాకసలు ఏమీ తెలీదు. ఏదీ తెలీదు! మరో పదిహేను సంవత్సరాల తరువాత, ఇప్పుడు మళ్ళీ నా ప్రపంచం కూలిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఏది తెలిసినా… తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు… I can handle this అని.”
“చూడగలగాలే కానీ ప్రతి అబద్ధంలోనూ ఓ నిజం ఉంటుంది. ఆ నిజమే అబద్దానికి ఉనికి.” ఈ కథకు శీర్షిక అనృతం’. అనృతం అంటే అబద్దం. ఆ అనృతంలో కూడా ఓ నృతం (నిజం) ఉండకపోలేదు! ఆ “కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన మార్గమే మనకి తెలుస్తుంది. చేరుకోబోయే గమ్యం కాదు.” గమ్యం ఎలా ఉండబోతుందో, అసలు గమ్యమంటూ ఉంటుందో లేదో తెలియకుండానే కథ అనే గమనాన్ని ఎంచుకున్నాను, పయనించాను. ఫలితం ఈ అనృతం’.
“ఓదార్చే తోడు లేదనిపిస్తే బాధ కూడా మాయమైపోతుంది.” ఈ వాక్యం నేను చూసిన సంఘటనల్లో నుండి రాశాను. తుడిచే చెయ్యే లేదనిపిస్తే కన్నీళ్ళు మాత్రం ఎందుకొస్తాయి? ప్రతి చర్యా, ప్రతిచర్యను కోరే జరుగుతుందేమో!
Reviews
There are no reviews yet.