Akula Narasamma

200.00

In stock

SKU: JANANI001 Category: Tag:
Author: Sonti Jaya Prakash

ఆకుల నరసమ్మ

ఒకే అర్థం వచ్చే రెండు పదాల సమ్మేళనం ఆ ఊరి పేరు. ‘నాగలిమడక’

ఆ ఊరిలో వెలసిన కొండ ఆ ఊరికే తలమానికం. అది చాలా ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది.

ప్రజలు దాన్ని ఊరుకొండ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తారు. ఒకే రాతితో ఏర్పడినట్లు తోచే కొండ పైభాగాన అసంఖ్యాకమైన చెట్లు, పొదలు

పెరిగివున్నాయి. ఆ ఘనగిరి గర్భంలోపల ఎన్నో గుహలున్నాయి. వాటిలో అడవి జంతువులు, రకరకాల పక్షులు, వివిధ విషసర్ప జాతులు, క్రిమికీటకాదులు ఆవాసం చేస్తుంటాయి. చిన్నపాటి అరణ్యాన్ని తలపిస్తుంటుంది కొండ ఉపరితలం.

ఒక కోణంలో నుండి – దూరంగా నిలబడి చూస్తే వేట పూర్తి చేసి, కడుపునిండా తిని, విశ్రాంతిగా, గంభీరంగా తల పైకెత్తి కూర్చున్న మృగరాజు భంగిమను తలపిస్తుందా కొండ. ఆ కొండపాదభాగం – దక్షిణ, పడమర దిశలకు విస్తరించి ఉంది. దానిపై గుబురుగా పెరిగిన విస్తారమైన పచ్చని చెట్లు, చూపరులకు కనువిందు చేస్తున్నాయి. కొండ కిందుగా నేలమీద, దరిదాపున ఒక నీటి కుంట ఏర్పడివుంది. ఆ కుంట నిరంతరం జలముతో కళకళలాడేది ఒకప్పుడు. కానీ ఇప్పుడది వట్టిపోయిన పాడియావులాగా తయారైంది. వర్షాకాలంలో చేరిన నీరు క్రమంగా ఇంకిపోయి, కుంట మధ్యలో చిన్నగా మడుగు కట్టి- అరుణవర ‘సమిళితమై – దాని ఉనికిని తెలియజేస్తుంటుంది. ఆ కుంట సమీపంలో – ఏపుగా పెరిగిఉందొక వేపచెట్టు,

సుమారు వందేళ్ళకు పైబడి ఉంటుంది ఆ చెట్టువయసు.

ఒక శతాబ్దికి మించిన కాలానికి ఎదురొడ్డి నిలిచిన యోధుని బౌద్ధత్యానికి ప్రతీకగా నిలిచి ఉందది. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటాయి. దాని శాఖోప…………

Author

Sonti Jaya Prakash

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Akula Narasamma”

Your email address will not be published. Required fields are marked *