సెలవులు అయిపోయి బడులు తెరిచారని పిల్లలు ఏడుస్తారనే అనుకున్నానిన్నాళ్ళూ.. ఈ రోజు… తెలుగు మాట ని వదిలేసి. గేయాచార్యుడు స్వర్గం బడి లో తెలుగు నేర్పడం కోసం నిష్క్రమించాడని. తెలుగు జాతి ఏడవాల్సి వస్తుందని ఊహించలేదు. దేవుని కి నిద్ర పట్టడం లేదు అనుకుంటాను. ‘ లాలీ లాలీ ‘అని జోలలు పాడించుకోవాలనే. స్వార్థం అయి ఉంటుంది.. లేకుంటే ఈ వాగ్దేవుడీతో, వినయ విశారదుడితో ఆయన కేం పని? ఒక్క ఒక్క రోజు ఒక్క మాటైనా అనని నిగర్విని..మననుండి తీసుకెళ్ళాడు… ‘అణువూ అణువున వెలసిన దేవా’ అని కీర్తించడమే పాపమా?.. లోకంలో పాపమింకా పెరగాలి కాబోలు.. .’విశ్వంభరా’ తత్వం తో ‘భూగోళమంత మానవుడి’ పరిణామ రహస్యాలను తెనిగించి, ‘నీ ధర్మం, నీ సంఘం నువ్వు మరవద్దు’. అన్న మానవత్వ ప్రవక్త ని మన నుండి దూరమెందుకు చేస్తాడు? ‘మంచిని సమాధి చేస్తారా?’ అని మనల్ని దండించే మానవీయ మూర్తి ఇంకెవరున్నారు? ఈ దుర్వార్త తో రామప్ప నాగార్జున సాగర్ లు స్థాణువులైపోవా?. .ఓ వైశ్వానరా!- తేట తెలుగు తో. అటు అగ్ని కణాల్ని ఇటు తుహిన తుషారాల్ని కురిపించిన అభినవ కవితా సవ్యసాచీ! మేమింకా అలానే ఉన్నాం… మంచి ని సమాధి చేస్తూ… అంతరంగం లోకి కాకుండా, ఆకాశం వైపు మోరెత్తి చూస్తూ.. మరో మానవ మత ప్రవక్త కోసం ఎదురు చూస్తూ.. –
Adhunika Andhra Kavitvam
₹600.00
In stock
Author | C Narayana Reddy |
---|---|
Format | Paperback |
Reviews
There are no reviews yet.