Addala Gadulu

100.00

In stock

SKU: analpa Category: Tag:

 కిరణ్మయి కథలు చదువుతూంటే, ఆమె కథ రాయాలని రాయలేదనిపిస్తుంది. తన అనుభవాలు, అనుభూతులు బయటపెట్టక తప్పనంత అనివార్యత తనకు అనిపించినప్పుడు మాత్రమే ఈ రచనలు చేసినట్టు అనిపిస్తుంది. ఈ కథల్లోని మరో లక్షణం – వీటిలో ప్రస్తావించిన సమస్యలు, ఘర్షణలకు ఒక ముగింపు ఇవ్వాలన్న ఆలోచనే లేకపోవడం. ఇవి ఆలోచనల సారంలా ఉంటాయి. కథాచిత్రాల్లా ఉంటాయి.
                 ఈ కథల్లో మనల్ని ఎక్కువ ఆకట్టుకునే అంశం – దొంగ గురించి మాట్లాడినా, వివాహేతర సంబంధాలలో ఉన్న వ్యక్తులని గురించి చెప్పినా, స్త్రీ పురుష సంబంధంలోని బోలుతనాన్ని చూపినా, పురుషాహంకారాన్ని ప్రస్తావించినా, ఎక్కడా రచయిత్రి తీర్పులు చెప్పకపోవడం. మనిషిలోని బలహీనతలను, మానవ సంబంధాల్లోని వైకల్యాలను సూచనాప్రాయంగా చెప్పడమే తప్ప ఎవరి ప్రవర్తన మీదా సిద్ధాంతాలు, నైతిక ఉపదేశాలూ, సందేశాలు ప్రకటించకపోవడం హాయిగా అనిపిస్తుంది.
                                       – మృణాళిని

Format

Paperback

Deliveried

4 – 9 DAYS

Author