ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘నా పైన పుస్తక ప్రభావం ఎంతో ఉంది.. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. నేను మారిపోయాను అని కమ్యూనిస్టులు అంటున్నారు… కానీ నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటాను. కమ్యూనిస్టు చరిత్ర, భారతీయ చరిత్ర, విశ్వదర్శనం వంటి పుస్తకాలు ఒకే సమయంలో నేను చదివాను. నేను అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేస్తాను.. మంచి పుస్తకాల కోసం తపన పడతాను. ఒక్కో పుస్తకంలో రాసే జీవితం.. వాటిలో అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. లక్ష్మీముట్టేస్ పూరి రాసిన సూర్యుడిని కబళించింది అంటే.. ఎంతో శక్తి వంతులు అని అర్థం. హనుమంతుడే సూర్యుడిని కబళించేందుకు వెళ్లారు.. సాధించాలి అనుకుంటే.. సూర్యుడిని కూడా మింగేయగలవని అర్ధం’ అని చెప్పుకొచ్చారు.
| author name | Lakshmi Murdeswar puri, A Krishnarao |
|---|---|
| Format | Paperback |





