ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికి ఎదల్ని కొస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల తాలుకా ముద్రాలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయిని ముంతలో వేసుకున్నట్టే…. ఆనందాలని , ఆశ్చర్యాలని, నిరంకుశత్వాన్ని మూసినా నిర్మలత్వాని, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లని, అంటిపెట్టుకున్న పసితనపు అరోమా వాసన్లని , కొనసాగుతోన్న కౌమారపు కాలాల కార్యాల లొలకపు కంపానలా అవర్తనాలను, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్తజీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలను ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.
Reviews
There are no reviews yet.