The Catcher In The Rye

200.00

In stock

SKU: the-catcher-in-the-rye Category: Tags: ,

   అక్కడ ఒక మిలియన్ కొద్దీ అమ్మాయిలూ వాళ్ళ డేట్స్ కోసం కూర్చునీ నిల్చునీ ఎదురు చూస్తూ ఉన్నారు. కాళ్ళమీద కాళ్ళు వేసుకున్న అమ్మాయిలూ, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అమ్మాయిలూ, అందమైన కాళ్ళున్న అమ్మాయిలూ, వికారమైన కాళ్ళున్న అమ్మాయిలూ, చాలా మంచి అమ్మాయిలూ, తిరుగుబోతు అమ్మాయిలూ. అది నిజంగా చాలా మంచి సైట్ సీయింగ్, నా ఉద్దేశం మీరు గ్రహిస్తే. ఒక విధంగా, అది డిప్రేస్సింగ్ గా కూడా ఉంది, ఎందుకంటే అక్కడున్న వారందరికీ ఏం జరుగుతుందో అని తలచుకుంటుంటే. నేననేది, వాళ్ళు స్కూల్, కాలేజీ నుంచి బయటకు వచ్చేసాక… వాళ్ళలో ఎక్కువ మంది బహుశా చెత్త వెధవలని పెళ్లి చేసుకుంటారని మనకు తెలుసు. వాళ్ళ తొక్కలో కార్లలో గాలన్ కి ఎన్ని మైళ్ళు వెళ్ళచ్చో అని ఎప్పుడూ మాట్లాడే అబ్బాయిలు, గోల్ఫ్ లో, చివరికి పింగ్ పాంగ్ ఆటలో కూడా, మీరు వాళ్ళని ఓడిస్తే చిన్నపిల్లలా కోపగించుకునే అబ్బాయిలు, సభ్యత, సంస్కారం లేని అబ్బాయిలు, అస్సలు పుస్తకాలు చదవని అబ్బాయిలు…

author name

N Tom Sawyer

Format

Paperback