Pagulu

500.00

In stock

దరారే దరారే, దిల్ మే దరారే…

ఇంటికైనా, జీవితానికైనా పునాది ముఖ్యం. పగుళ్లు సహజం. వాటిని మరమ్మత్తు చేసుకుని పునాదులు రక్షించుకుంటేనే ఇల్లెనా జీవితమైనా నిలబడేది. ఒక్కోసారి అతి చిన్న పొరపాట్లు కూడా చిన్న పగుళ్ళకి కారణమయి, అవి పెరిగి పెద్దవై కూలిపోడానికి దారితీస్తాయి. పగుళ్లు పూడ్చడానికి చేసే ప్రయత్నాలు అన్నిసార్లూ ఫలించవు.

శశిధర్ విద్యావంతుడు, సున్నితమయిన మనస్కుడు, సంస్కారి, భావుకుడు. తను మనసుపడిన అందాల చందమామ శిరీషను దక్కించుకుని, తన పేరుని సార్లకం చేసుకోవాలనుకున్నాడు. ఏళ్ళపాటు తంటాలుపడి దక్కించుకున్నాడు కూడా. శిరీష అతని జీవితంలో వెన్నెల కురిపించిందా? వారి జీవితంలో పగుళు ఎలా మొదలయ్యా యి, ఎక్కడికి దారితీసాయి అనేది ఈ పగులు కథ. శశిధర్ కథ.

తమ పెళ్లి వేడుకని ఒక మరిచిపోలేని అనుభూతిగా మార్చాలని ఆశపడి అతను చేసిన చిన్నపని వికటించి మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలింది. అక్కడ పడింది. మొదటి పగులు వాళ్ళ బంధానికి. ఫలితం ఇద్దరి మధ్యా రోజు రోజుకీ పెరిగిన మానసిక దూరం, రైలు పట్టాల లాంటి జీవితం. ఆ తల్లిదండ్రుల మధ్య పిల్లలు ఎలా నలిగిపోతారు అనేది ఊహించలేనిది కాదు. వీళ్ళ జీవితం ఎలా సాగింది, పగుళ్లు ఎప్పటికన్నా పూడ్చబడ్డాయా?

‘దరారే దరారే హై మాథేపే మౌలా , మరమ్మత్ ముకద్దర్ కి కర్ లో మౌలా’ (దరారే – ముడతలు/పగుళ్లు) అని ఒక సూఫీ గీతం. తన నుదిటి రాతలని మరమ్మత్తు చెయ్యమని శశిధర్ దేవుడిని అడగలేదు. తన జీవితంలో జరిగే వాటిని………

author name

Tadikonda K Shiva Kumar Sharma
American Telugu Association

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Pagulu”

Your email address will not be published. Required fields are marked *