ఆర్యభట్టీయం 5 వ శతాబ్దానికి చెందిన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు రాసిన ఒక పురాతన సంస్కృత గ్రంథం. ఆర్యభట్టు రాసిన ఈ ఒక గ్రంథం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పుస్తకం భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగా రాయబడింది. మరో ప్రాచీన భారతశాస్త్రవేత్త అయిన భాస్కరుడు ఈ పుస్తకంపై వ్యాఖ్యానం రాశాడు.
ఈ పుస్తకం దశగీతిక అనే శ్లోకంతో ప్రారంభమౌతుంది. ఈ శ్లోకంలో ఆర్యభట్టు హిందూ మతంలో అన్నింటికి మూలాధారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తించాడు. ఈ గ్రంథంలో నాలుగు అధ్యాయాలున్నాయి.
గీతికా పాదం: ఇందులో 13 శ్లోకాలున్నాయి. కల్పం, మన్వంతరం, యుగం లాంటి కొలమానాలు ఉపయోగించి అతిపెద్ద కాలాలను కొలవడం గురించి ఇందులో ప్రస్తావించబడి ఉంది.
గణిత పాదం: ఇందులో క్షేత్ర గణితం గురించి ప్రస్తావించబడింది. అంకశ్రేడి, గుణ శ్రేడి లాంటి విషయాల గురించి రాయబడింది.
కాలక్రియా పాదం: కాలాన్ని కొలిచేందుకు వివిధ ప్రమాణాలు, ఒక రోజున గ్రహస్థితులు ఎలా ఉంటాయో తెలిపే పద్ధతులు, అధిక మాసాలు, క్షయ తిథులు, వారం రోజులు, వాటి పేర్లు మొదలైన వివరాలు పేర్కొనబడ్డాయి.
గోళ పాదం:
ప్రాముఖ్యత Arya Bhattiyam
ఈ గ్రంథం సౌర వ్యవస్థ యొక్క భూకేంద్రక నమూనాను ఉపయోగిస్తుంది. దీనిలో సూర్యుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాయి. కొంతమంది వ్యాఖ్యాతలు, ముఖ్యంగా బిఎల్ వాన్ డెర్ వైర్డెన్, ఆర్యభట్ట భూకేంద్రక నమూనాలోని కొన్ని అంశాలు అంతర్లీనంగా సూర్య కేంద్రక నమూనా యొక్క ప్రభావాన్ని సూచిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే దీన్ని నోయెల్ స్వర్డ్లో విమర్శించాడు. ఈ అభిప్రాయాన్ని పాఠ్యంలో ఉన్న భావనకు ప్రత్యక్ష వైరుధ్యంగా పేర్కొన్నాడు.
Reviews
There are no reviews yet.