వ్యదార్ధ జీవుల యదార్ధ గాధలు
” కొందరు గొప్పవారుగా జన్మిస్తారు”
అదృష్టవంతులు
“ఇంకొందరకు గొప్పదనం ఆపాదించబడుతుంది”
వీరు అదృష్టవంతులే
“మరికొందరు గొప్పదనాన్ని సాధిస్తారు”
మనం చెప్పుకోవలసింది వీరిని గురించే!
చెప్పుకోవడాని కావలసినన్ని అంశాలు కూడా వీరి జీవితాల్లోనే లభిస్తాయి. ఎంచాతనంటే ఈ చివరి కోవకు చెందినవారు గొప్పగా జన్మించలేదు. ఇంకెవరో, ఏవో ప్రయోజనాల నాశించి, లేని గొప్పదనాన్ని వీరికి మప్పనూ లేదు. కానీ వీరు గొప్పదనాన్ని సాధిస్తారు, సాధించారు. అలా సాధించడానికి ముందు, కోటాను కోట్లుగా ఉన్న అతి మామూలు వ్యక్తుల్లో వీరు ఒకరయి వుండాలి. పరిస్థితుల ఆటుపోట్లకు వీరూ అతలాకుతలమయి ఉండాలి. సుడిగాలిలో చిక్కుకొన్న గడ్డిపరకలా వీరూ, గిరికీలు తిరిగి వుండాలి. ఎప్పుడు, ఎ దిక్కుకు, ఎగసి పోవాలో, ఎప్పుడు ఏ ముళ్ళకంచె మధ్య నిశ్శబ్దంగా రాలిపోవాలో, వీరికి తెలియకపోవాలి. రేపటి సంగతి సరేసరి – మరుక్షణానికేం జరుగుతుందో కూడా తెలీని, అనిశ్చిత వాతావరణంలో వీరు మనుగడ సాగిస్తూ వుండాలి. వీరందరూ సామాన్యులే! సామాన్యంగా జన్మించి, సామాన్యంగా జీవించి, సామాన్యంగానే కనుమరుగయి పోతారు. వీరిలో ఏ నూటికోకరో కాదు – ఏ కోటికోకరో – శక్తివంతులుంటారు. అయితే ఆ శక్తీ పైకి కనబడదు. అది చిచ్చక్తి లాగా అణు గర్భంలో నిక్స్తిప్తమైన వుంటుంది. మరుభూముల్లోని ఏ రాయో, ఏ రప్పో, వారికీ ఆసరాగా దొరుకుతుంది. అప్పుడు వారి కావలసినవి సేకరించుకొని ఎదుగుతారు. ఆకాశమే వారికీ అవాలి సరిహద్దు.
-రావూరి భరద్వాజ
“జీవన సమరం” శీర్షికన వెలువడిన ఈ రచనలన్నీ, మన సామాజిక జీవనానికి ప్రతి బింబాలు. ఇందులోని వ్యక్తులు – మనకు బాగా తెలిసినవారు. మనతోబాటు మన మధ్యనే జీవిస్తున్నవారు. వీరిని గురించి మనం ఆలోచించం. వీరిని చూసి మనం స్పందించం. ఈ “అదోజగత్సహోదరు”ల బతుకుల్లోకి తొంగి చూడాలంటేనే మనకు భయం. శ్రీ భరద్వాజ – మనం చేయలేని ఈ పనులన్నీ చేశారు. వారి బతుకుల్లోకి తొంగిచూసి, స్పందించి, మనల్ని స్పందింపజేసారు. వేయేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రకు – అచ్చంగా, అట్టడుగు వర్గాల యదార్ధ చరిత్రలతో నిండిన తొట్టతొలి గ్రంధాన్ని చేర్చిన ఘనత – భరద్వాజకు లభించినందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను.
– చెరుకూరి రామోజీరావు, ఈనాడు
Reviews
There are no reviews yet.