అనువాదం ఒక కళ
*Aujourd hui, maman est morte.”
పైనున్న వాక్యాన్ని గుర్తుపట్టారా? Albert Camus రాసిన ఫ్రెంచ్ నవల ‘TEtranger” లోని మొట్టమొదటి వాక్యం అది. ఈ నవలను మొదటగా 1946లో స్టూవర్ట్ గిల్బర్ట్ అనే బ్రిటీష్ స్కాలర్ అనువాదం చేసినప్పుడు, పైనున్న వాక్యాన్ని ఇంగ్లీష్ లో “Mother died today’ గాను, ఈ పుస్తకం టైటిల్ ని “The outsider” గానూ అనువదించారు. అయితే ఇది సరైన అనువాదం కాదనే చర్చ చాలా ఏళ్ళపాటు నడిచింది. 1982లో మరోసారి ఈ నవలను జోసెఫ్ లారెడో, కేట్ గ్రిఫిత్ అనే అనువాదకులు కొత్తగా అనువదించినప్పుడు ఈ పుస్తకం టైటిల్ “The Stranger’ గా అనువదించి, మొదటి
లైన్‌ని ‘ Mother died today” గానే అనువదించారు. కానీ 1988లో మాథ్యూ వార్డ్ అనే అమెరికన్ రచయిత ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదిస్తూ, నవలలోని మొదటి వాక్యాన్ని, ‘Maman died today” గా అనువదించారు. పెద్దగా ఏమీ మార్పులేదు. Mother అనే పదాన్ని Maman గా మార్చారంతే. కానీ ఇక్కడే అసలు విషయమంతా ఉంది. మొసో అనే పాత్రధారి చేసిన నేరం, ఆ నేరం చేయడం వెనుక అతని కారణాలను ఎత్తిచూపడానికి, మొసో పాత్రధారికి అతని తల్లి పట్ల ఉన్న (లేని) ఆత్మీయత – ఈ కథలో ప్రధానాంశం. కాబట్టే ఈ మొదటి వాక్యంలో……………
Reviews
There are no reviews yet.