తొలి తెలుగు ప్రాంతీయ వివక్ష నవల “సాధన”
శాంతినారాయణ రాసిన ప్రస్తుత నవల ‘సాధన’. అతని తొలినవల ‘మాధురి. రెండవ నవల ‘పెన్నేటి మలుపులు’. ఈ రెండు నవలల తరువాత అతడు మరో | నాలుగు నవలికలు రాసినాడు. అవి రక్షకతడులు, వెట్టికి పెట్టి, కంచం మీద కట్టడి, నూర్జహాన్. పెన్నేటి మలుపులు రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ నవల. అయితే, ఈ ‘సాధన’ నవల రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వవాద నవల.
ఒక ప్రాంతపు ప్రత్యేక లక్షణాలతో పోషింపబడిన జీవితం ప్రాంతీయ అస్తిత్వం అవుతుంది. ఒక ప్రాంతాన్ని వెనుకబాటుతనానికి గురిచేసిన ఆధిపత్య ప్రాంతాన్ని ప్రశ్నించడం ప్రాంతీయ అస్తిత్వవాదం అవుతుంది. సాధన నవల ప్రాంతీయ అస్తిత్వవాద నవల! సాహసోపేతమైన రచన కూడా.
సాధన నవల సాహసోపేతమైన రచన ఎందుకైంది?
సత్యం అన్నివేళలా సౌకర్యమైంది కాదు. అందుకే నిజం నిష్టూరంగా ఉంటుంది. అంటారు. కరువుసీమ రైతులకు కృష్ణా నీళ్లను దూరంచేయడం కానీ, విశాలాంధ్ర కోసం రాయలసీమ ప్రజలు కర్నూలు రాజధానిని వదులుకోవడం కానీ, నిష్ఠుర
నిజాలు కాకుండా ఎట్లావుంటాయి? ఈ నిష్ఠుర నిజాలను వేలెత్తి చూపి, దానికి కారణమైన మరోప్రాంతపు ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఎంత గుండెదిటవు కావల్ల? ఈ గుండెదిటవు, ఈ రచయితకు మస్తుగావుంది.
సాహసం సాపేక్షికమే కదా… ఏ సాహిత్య వాతావరణంలో సాధన నవలారచన సాహసకృత్యమైంది?………….
Reviews
There are no reviews yet.