శారదదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిదిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అందంగా, మనసులోంచి అలవోకగా పుట్టినట్టు ఉంటాయి. ఎదుటి వారి మనసులను సుతారంగా తాకుతూ ఉంటాయి. ఈ కథలు చదువుతుంటే నిర్మలమైన నదిలో స్నానం చేసినట్లు ఉంటుంది.
-ఎస్వి.భుజంగరాయశర్మ.
“జీవితం అనే తోటలో ఏరిన వివిధ పుష్పాలు, తెలుగు భారతికి పగడాలమాల ఈ కథానికలు”.
-రాజమన్నారు.
“వికాసోన్ముఖమైనఅనుభవ పరిణితి చాలని సీమంతిని హృదయంలోని వేదన ఇది. ‘ఇంతేనేమో’ అనికాని ‘ఇంతే’ అని ధైర్యంతో చెప్పలేని హృదయ దైన్యం, ధైర్యంగా వేషం వేసుకోవడానికి ముందు జీవిత నేపథ్యంలో చూపే అవ్యవస్థ, తొందర- ఈ వేదన. దాన్ని ఎంతో సహనుభూతితో ఈ ప్రబంద సంగ్రహంలోని ఒక్కొక్క ఖండికలోనూ చల్లగా సన్నని కంఠంతో చిత్రించారు. శ్రీమతి అచంట శారదాదేవి”.
-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
“ఏ ఉత్తమ రచనకైనా అనుభవం అతి ముఖ్యం. ఈ అనుభవం వల్లనే నిజాయితి కలుగుతుంది. అతి ప్రధానమైన ఈ నిజాయితీకి అందము, అలంకరణ కోసమూ ఊహా, కల్పనా సాయపడతాయి. నిజమైన అనుభవము ఈ ఊహా, కల్పనలతో ఎంతో ఆకర్షవంతంగా అమరుతుంది అది సాధించినవారు మనకు సన్నిహితులవుతారు. శారదాదేవి ఇట్లాంటి రచయిత్రి.”
-బుచ్చిబాబు.
“మధ్య తరగతి బ్రాహ్మణ జీవితాలను, వారి కుటుంబ వాతవరణాన్ని ప్రధానంగా చిత్రించే శారదాదేవి కథలోని మనల్ని ఆకర్షించేది ఆమె నిజాయితి. ప్రతి కథలోనూ రచయిత్రి వ్యక్తిత్వాన్ని, సౌందర్యాన్ని బాగా ఇష్టపడే శారదాదేవి కథల్లో చేసే వర్ణనలు కూడా అంత సహజ సౌందర్యంతో ‘అతి’ లేకుండా ఉంటాయి.”
-ఓల్గా.
Reviews
There are no reviews yet.