అప్పికట్ల వారి వీధికి ఆహ్వానం
1972లో వడ్డెర చండీదాస్ గారి నవల “
హిమజ్వాల” ఆంధ్రజ్యోతి
భాగానికి వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, ప్రతివారమూ ఆ నవలా వేసిన బొమ్మలు కూడా ఆ నవలంత కొత్తగా, అధునాతనంగా వుండేవి. ఆ బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు బాలి. అదీ బాలిగారితో తెలుగు సాహిత్యానికి తొలి పరిచయం. (అప్పటికే కొన్ని నవలలకు బొమ్మలు వేసి ఉంటారు). అప్పటి నుంచీ తెలుగు పత్రికలకో కొత్త చిత్రకారుడు దొరికాడు. అప్పటి పత్రికల చిత్రకారుల్లాగే ఆయన కూడా ఆ తరువాత కార్టూన్లూ గీసి నవ్వించారు. వాళ్లలో చాలా మందికి భిన్నంగా అప్పుడప్పుడు కథలూ రాశారు. బాపూగా రొకటి రెండు కథలు రాసినట్టు యెవరో చెబుతుంటే విన్న గుర్తు. చంద్రగారు చాలా కథలు రాశారు. అయితే యిలా కథల సంపుటాన్ని ప్రచురిస్తున్న తొలి పత్రికా చిత్రకారుడు నాకు తెలిసి బాలిగారొకరే!
యీ సంపుటంలోని కథలన్నీ వొక ప్రముఖ చిత్రకారుడి కుంచెలోంచి వచ్చిన కథలు, అంతకంటే మౌలికంగా విశాఖపట్టణం దగ్గరి అనకాపల్లి అనే వూళ్లో వుంటే వొక మధ్యతరగతి వ్యక్తి బాల్య ప్రజ్ఞాపకాల దొంతరలు. పట్టుమని అయిదారు పేజీలకు మించని కథలే వున్న యీ సంపుటంలో చిత్రంగా, వూహించ రీతిలో, (238వ పేజీ నుంచి దాదాపు 57 పేజీల నిడివుండే) పెద్ద కథ వొకటుంది. దాని పేరు ‘అప్పికట్ల వారి వీధి’. ఆ కథ చదువుతున్నంత సేపూ నాకు ముళ్లప్పూ
వెంకటరమణ గారి ‘జనతా ఎక్స్ ప్రెస్’ కథే గుర్తుకొచ్చింది. ముళ్లపూడి గా బాపూగారనే గొప్ప స్నేహితుడుండేవారు. ఆయన తన స్నేహితుని కథలకు యిం ముబ్బడిగా బొమ్మలేసి పెట్టేవాడు. ‘జనతా ఎక్స్ ప్రెస్’ అనే ఆ పెద్ద కథ నాండా…………
Reviews
There are no reviews yet.