జాక్ లండన్ రచించిన ‘ఉక్కుపాదం’ అద్భుతమైన, ప్రతిభావంతమైన రచన. సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ వచ్చిన నవలలు అనేకం ఉన్నాయి. బహుశా ఉక్కుపాదం మొదటి సైద్ధాంతిక రాజకీయ నవల. కాల్పనిక సాహిత్యం చదివేందుకు ఇష్టపడే అనేకమంది పాఠకులు తత్వశాస్త్రం, ఆర్ధికశాస్త్రం లాంటి వాటిని చదివేందుకు ఇష్టపడరు. ‘ఉక్కుపాదం’ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. జీవిత సత్యాలను అన్వేషించదలచుకున్నవారికి ఇది చదవటం అనివార్యం. సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి తుది పోరాటంలో తమవైపు ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అలాంటి కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం ‘ఉక్కుపాదం’.
Author | Muktavaram Parthasarathi |
---|
Reviews
There are no reviews yet.