ముక్తవరం పార్థసారధి గారిలాంటి రచయితల రచనలకు ముందుమాట రాయాలనుకోవడం సాహసమే అవుతుంది. అయితే పబ్లిషింగ్ హౌస్ తరపున మా మాటగానో, ముందుమాటగానో రాయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఈ ప్రయత్నం.
కథలు, నవలలు, నాటకాలూ, అనువాద కథల ద్వారా వామపక్ష భావజాలాన్ని విస్తరింపజేయాలనే సంకల్పంతో విశేషంగా కృషిచేస్తున్నవారిలో పార్థసారథిగారు ముందు వరుసలో నిలుస్తారు. జాక్ లండన్ కలం నుండి వెలువడిన ఐరన్ హీల్ అనే నవలను ‘ఉక్కుపాదం’ పేరుతో అద్వితీయంగా అనువదించారు. అందులో విలువైన అనేక పాద సూచికలున్నాయి. నాటి అమెరికా సామాజిక వ్యవస్థనూ, సోషలిస్టు ఉద్యమాన్ని అవగాహన చేసుకోవడానికి ఆ నవలా, అందులోని వివరణలు గొప్పగా ఉపకరిస్తాయి. దాదాపుగా పది నవలలు, అనేక కథా సంపుటాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి. పాఠకుల మనస్సులను ఆకట్టుకునే రీతిలో ఆయన నవలలు, కథలు నడుస్తాయి.
‘విశ్వ కథాశతకం’ శీర్షికతో ప్రసిద్ధిగాంచిన నూరుమంది రచయితల నుండి నూరు రచనలను స్వీకరించి వాటిని శ్రమించి అనువదించారు. ఆయా కథల కాలంనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే రచనలను ఎంచుకోవడంతో పాటు, ప్రతి రచయితను గురించిన సమాచారాన్ని కూడా మనకందించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పార్థసారథిగార్కి కృతఙ్ఞతలు తెలియజేస్తుంది.
– గడ్డం కోటేశ్వరరావు
Reviews
There are no reviews yet.